Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు : మంత్రి మేకపాటి

ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు : మంత్రి మేకపాటి
, బుధవారం, 3 జూన్ 2020 (20:44 IST)
భవిష్యత్ లో రాష్ట్ర యువతకు  అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు అందించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, ఐటి, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఓంక్యాప్) ఉన్నతాధికారులతో బోర్డు మీటింగ్ జరిగింది. చైర్మన్ హోదాలో హాజరైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతత్వంలోని సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
 
అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు, సరికొత్త కోర్సులు, శిక్షణ వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కరోనా ఉధృతి తగ్గిన తర్వాత వైద్యరంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయని డాక్టర్లు, నర్సులు, టెక్నిషియన్ల వంటి సమాచరం సేకరించడంపై దృష్టిసారించాలని మంత్రి పేర్కొన్నారు. 

గల్ఫ్ దేశాలతో పాటు, జపాన్, స్వీడన్, ఇటలీ, జర్మనీతోపాటు యూరప్ దేశాల్లో వైద్యరంగంలో ఉద్యోగాలకు డిమాండ్ ఉందని, మన రాష్ట్రంలోని యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించి వారిని ప్రోత్సహించి వారి భవిష్యత్ ను తీర్చిదిద్దాలని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, టెక్నీషియన్లు, ఇతర వృత్తి నైపుణ్యం  ఉన్నవారు ఎక్కువ అవకాశాలు పొందేలా ఓంక్యాప్ కృషి చేయాలని, అవసరమైతే జులై నెలలో మంత్రి మేకపాటి నేతృత్వంలోని బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని సమావేశంలో నిర్ణయించారు.
 
ఓంక్యాప్ వెబ్ సైట్ ను ఆధునీకరించి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కచ్చితమైన సమాచారం, సౌకర్యాలు అందేలా చూడాలని నిర్ణయించారు. ఉపాధి కోసం విదేశాల నుంచి ఏపీకి వచ్చే  వారికి నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా ఓవర్సీస్ స్కిల్స్ రిజిస్టర్ ను తయారు చేయాలని, ఆసక్తి, అనుభావాన్ని బట్టి ఉద్యోగం పొందేలా  తోడ్పాడునందించాలని తెలిపారు.

దేశ, విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారుల సహకారంతో గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాల్లోని అంబాసిడర్లతో సంప్రదించి రాష్ట్రంలో అమలవుతున్న నైపుణ్యశిక్షణా కార్యక్రమాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. 

ఓమ్ క్యాప్ బోర్డ్ మీటింగ్ లో నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఓంక్యాప్ సంస్థ ఎండీ, సీఈవోతోపాటు ఓంక్యాప్ జనరల్ మేనేజర్ కె.వి.స్వామి  హాజరయ్యారు.  
 
దశలవారీ అభివృద్ధికి సూచనలు
కరోనా అనంతరం ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చన్న దానిపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక సూచనలిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి చేపట్టవలసిన తక్షణ చర్యలపై ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.

‘జంప్ స్టార్ట్ ఇండియా @ ఐఎస్ బీ’ పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్ బీ ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పారిశ్రామిక, ఐ.టీ, నైపుణ్య రంగాలపై, రాష్ట్రంలో చేపడుతున్న చర్యలపై మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయాలు వెల్లడించారు.

త్వరలోనే దేశవ్యాప్తంగా పరిశ్రమలు పూర్తి స్థాయిలో రీస్టార్ట్ అవనున్న నేపథ్యంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై చర్చించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులను రక్షించుకోవడం, వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఐ.టీ అభివృద్ధితో దశలవారీగా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకోవడం, నిరంతర పర్యవేక్షణతో సరైన చర్యలు చేపట్టడం,

పరిశ్రమలలో తయారైన ఉత్పత్తుల సరకు రవాణా పెంచడం, ప్రజా రవాణను తిరిగి ప్రారంభించడం, ప్రయాణాల్లో భౌతిక దూరం పాటించేలా సౌకర్యాలు కల్పించడం. ఇలా అన్ని రకాల చర్యలు చేపట్టే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆయా రంగాలలో కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎలా ముందుకెళుతుందన్న దానిపై మంత్రి గౌతమ్ రెడ్డి పలు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు..