Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి డీపీఆర్ లు : ఆదాయ మార్గాలు, నిధుల సమీకరణపై అన్వేషణ

Advertiesment
DPRs
, బుధవారం, 3 జూన్ 2020 (20:25 IST)
రాబోయే రెండేళ్లలో పూర్తి చేయవలసిన పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి సంబంధించి డీపీఆర్ లు సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటి, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్, విమానాశ్రయాలు, పోర్టుల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రధానంగా చర్చించారు.

మానుఫాక్చరింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పన్ను, రాయితీలలో వెసులుబాటుతో పాటు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశముంటుందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకూ ప్రభుత్వంపై ఆధారపడకుండా పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి గల మార్గాలను అన్వేషించాలని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగం, ప్రత్యామ్నాయ మార్గాలపై లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి తెలిపారు.
 
అనంతరం విజయవాడ గన్నవరంలోని హెచ్ సీఎల్ క్యాంపస్ ను ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సందర్శించారు. హెచ్ సీఎల్ క్యాంపస్ నమూనాలను, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను మంత్రి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు.

హెచ్ సీఎల్ సాఫ్ట్ వేర్ ఎజిల్ ల్యాబ్ తిలకిస్తూ సంబంధించిన  వివరాలను ప్రత్యేకంగా  మంత్రి మేకపాటి  అడిగి తెలుసుకున్నారు. హెచ్ సీఎల్ సెజ్ టవర్ వన్ రెండో అంతస్తులో ఉన్న బోర్డు రూమ్, గోల్ఫ్ కార్ట్ లను కూడా విజిట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకేమైనా సమస్యలున్నాయా? రైతులను అడిగిన రోజా