ఏపీలో రేపు 2,62,493 మంది లబ్దిదారులకు రూ. 10,000 చొప్పున జమ

బుధవారం, 3 జూన్ 2020 (20:34 IST)
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైనా. ఉపాధి లేక, చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది.

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 37,756 వేల మంది ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేడు (4 వ తేది) ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు.

మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పధకంలో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో ఇవ్వాల్సిఉన్నా కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
లబ్ధిదారుల్లో అధిక సంఖ్యలో బీసీలే..
ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,590 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు.. 10,049 మంది ఎస్టీలు.. 28,118 మంది మైనార్టీలు.. 581 బ్రాహ్మణ, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధికి డీపీఆర్ లు : ఆదాయ మార్గాలు, నిధుల సమీకరణపై అన్వేషణ