Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మదనపల్లె టమోటా మార్కెట్ కు ఏమైంది?

మదనపల్లె టమోటా మార్కెట్ కు ఏమైంది?
, మంగళవారం, 2 జూన్ 2020 (20:58 IST)
మదనపల్లె టమోటా మార్కెట్ పేరుకే ఆసియాలోనే అతిపెద్దది. ఇక్కడి సేవలు మాత్రం నామమాత్రం. రైతులకు తగినంతగా సౌకర్యాలు లేకపోగా ఎటు చూసినా పారిశుధ్య లోపం కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది.

మదనపల్లె టమోటా మార్కెట్ కు మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుండే కాకుండా కర్నాటక రాష్ట్రంలోని రాయలపాడు, లక్షీపురం, శ్రీనివాసపురం, తదితర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో టమోటాలు తీసుకొని వచ్చి విక్రయిస్తారు. వేలాది టన్నుల టమోటాలు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రలకు తరలిస్తారు. 

అయితే మదనపల్లె టమోటా మార్కెట్ నందు‌ సౌకర్యాలు లేకపోగా అపరిశుభ్ర తాండవిస్తోంది. మార్కెట్ యార్డు నిర్వహణ భాద్యతలు చూసే అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడంతో ఎటుచూసినా కుళ్ళిన టమాటా‌ దిబ్బలు కనిపిస్తాయి. కుళ్ళిన టమాటాలు నెలల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో విపరీతమైన దుర్గంధం వ్యాపించి సకల రోగాలకు కారణం అవుతోంది.

‌వందల సంఖ్యలో టమోటా కమీషన్ మండిలు వున్నాయి. వేలాది మంది నిత్యం మార్కెట్ కు వస్తుంటారు. కూలీలు, రైతులు, వాహన చోదకులు ఇలా వేలాదిగా వస్తున్న వారందరూ దుర్గంధం కారణంగా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ‌వర్షం పడిందంటే చాలు వాహనాల రాకపోకల వలన చిధ్రమైన టమోటాల మూలన విపరీతంగా దుర్వాసన వస్తుంది.  చినుకు పడితే చిత్తడి చిత్తడి అవుతుంది. నడవడానికి వీలు లేని దుస్థితి కనిపిస్తుంది.

కాల్వల్లో వెళ్లాల్సిన నీరంతా ఎక్కడికక్కడ నిలిచి పోతున్నది. భారీ వర్షం కురిస్తే చాలు కాల్వల్లో పేరుకపో యిన చెత్త, మురుగు ధాటికి అక్కడ పనిచేసే కులీలు రోగాల బారిన పడల్సిందే.‌ మార్కెట్ నందు  పారిశుధ్య సిబ్బంది వున్నారా అనే ప్రశ్నలకు అధికారుల సమాధానం శూన్యం. పాలకుల నిర్లక్ష్యమో, అధికార యంత్రాంగం నిర్లిప్తతనో తెలియదు కానీ, మదనపల్లె పట్టణంలో‌ వున్న టమోటా మార్కెట్ పాలక మండళ్ల ఎన్ని మారిన సౌకర్యాలు మాత్రం లేవు.‌

మున్సిపల్‌ అధికారులు పర్యటించిన ధాఖాలాలు లేవు. మున్సిపాలిటీ శానిటేషన్‌ అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కొట్టు కొచ్చినట్లు కనిపిస్తుంది.‌ టమోటా మార్కెట్ దుర్గంధం చూటు నివాసం వుంటున్న వారికి సంకటంగా మారింది.

రహదారిపైకి కంపుకొడుతున్న అధికారులు చూసి చూడనట్లు వెళ్ళి పోతున్నారు. దీనికి తొడు మార్కెట్ నందు ఎక్కడ  బ్లీచింగ్‌ పౌడర్‌, దోమల మందు కనిపించవు.  కరోనా వైరస్ నివారణ కోసం శానిటైజేషన్ చేయాలని‌ వున్న మార్కెట్ లో అలాంటి చర్యలు లేవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన గర్భిణీ..తల్లీ బిడ్డ క్షేమం