తెలుగు రాష్ట్రాల గారాల పట్టి, సంగీత పుత్రిక బారతదేశం గర్వించ దగ్గ ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియను విశాఖ పట్నంలో ఘనంగా సన్మానించనున్నట్లు ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ తెలిపారు. ఆర్ ఆర్ "విశ్వ గాన ప్రియ" బిరుదు, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ లో "యంగస్ట్ సింగర్ అఫ్ ఇండియా" అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి సిదిరి అప్పల రాజు, ఎం.పీ ఎం.వీ.వీ.సత్యనారాయణ, మేయర్ హరి కుమారి, జీవీ, మల్ల విజయప్రసాద్ లు హాజరవుతారని అంతర్జాతీయ ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ తెలిపారు.
ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ, ఎంతో మంది గొప్పవారి నుండి ఆశీసులు పొందిన షణ్ముఖ ప్రియకు ఇటువంటి సన్మానం చేయడం ఒక అదృష్టమని తెలిపారు. సెప్టెంబర్ 5న ఫోర్ పాయింట్స్ వేదిక వద్ద బయట గుర్రం బగ్గీ లో షణ్ముఖ ప్రియను ఊరేగిస్తామన్నారు. రంజిత్ మాట్లడుతూ, మన విశాఖ జిల్లా నుండి వెళ్లిన ఈ అమ్మాయి ఒక ఆణిముత్యమని, అందుకే వీరుమామ చెప్పగానే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నామని అన్నారు.
విజయ కుమార్ మాట్లడుతూ, చిన్నారి షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుండి (పది లక్షలు విలువైన )108 గజాలు స్థలం గిఫ్ట్ గా ఇస్తున్నట్టు తెలిపారు. రోటరీ సెంటిన్నిల్ ప్రెసిడెంట్ దొర బాబు మాట్లడుతూ, వీరుమామతో ఇటువంటి కార్యక్రమానికి రోటరీ కలవడం గర్వ కారణమని అన్నారు.