Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ‌లో విక్ట‌రీ ఫ్లేమ్ సైనికుల‌కు అందించిన హోం మంత్రి సుచ‌రిత‌

Advertiesment
విశాఖ‌లో విక్ట‌రీ ఫ్లేమ్ సైనికుల‌కు అందించిన హోం మంత్రి సుచ‌రిత‌
విజయవాడ , శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:05 IST)
విశాఖపట్నం ఆర్.కె.బీచ్ రోడ్ లోని విక్టరీ అట్ సీ వద్ద జరిగిన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, హోంమంత్రి భర్త, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, విజయ నిర్మల, నేవీ అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
 
1971 లో ఇండో-పాక్ యుద్ధంలో భారత వైమానిక దళాలు విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో విక్టరీ ఫ్లేమ్ ను హోంమంత్రి సుచరిత గారికి సైనికులు అందించారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు చిహ్నంగా ఏర్పాటు చేసిన స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలలో అతి తక్కువ సమయంలో విజయం సాధించిన యుద్ధంగా దీనిని పేర్కొనవచ్చని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. మన సైనికులు సాదించిన విజయం భారత దేశానికి గర్వకారణమన్నారు. 
 
ఈ యుద్ధంలో దాదాపు 3 వేల మంది సైనికులు వీరమరణం పొందడం తో పాటు, 12 వేల మంది గాయపడ్డారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల వలనే మనం ప్రశాంతంగా ఉన్నామన్నారు. త్రివిధ దళాల సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ,శత్రు దేశాల నుండి భారత దేశాన్ని రక్షిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సైనికుల త్యాగాలను మనమందరం గౌరవించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం స్టాలిన్ పై పవన్ ట్వీట్, కోటి మంది చూసారు, తమిళనాడు అసెంబ్లీలో చర్చ