విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.
రాజరాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభాయే నమోః నమాః అనే ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే.. ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింప చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారు ఈ మంత్రాన్ని జపిస్తే... తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
ఇవాళ జమ్మి చెట్టు రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే ఈ విజయ దశమి రోజు... సాయంకాలం పూట నక్షత్రాలు కనిపించక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
సంవత్సరం మొత్తం విశేషంగా ఆర్థికంగా పురోభివృద్ధి పొందవచ్చు. అన్ని సమస్యలను తొలగించకోవచ్చు.