శుక్రవారం వీకెండ్ కావడంతో నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ డైమండ్ పాయింట్ దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 12 బైక్‌లు, ఐదు కార్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ల్లో సాయి నితీష్ అనే యవకుడు వీరంగం సృష్టించాడు. చాలా సేపు బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు నిరాకరించాడు. పోలీసులు ఎంత నచ్చజెపనా వినకుండా తానో వీఐపీ కొడుకునుoటూ వీరంగం చేసాడు. పోలీసులు, మీడియాపై చిందులేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు, సాయి నితీష్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
ఎట్టకేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో సాయి నితీష్ మద్యం సేవించినట్లు నిర్దారణ అవడంతో కేసు నమోదు చేసి బెంజ్ కారుు స్వాధీనం చేసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు.. కార్‌లో ఓ ఫుల్ మద్యం బాటిల్‌ను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు..
స్వాధీనం చేసుకున్న బెంజ్ కారును బేగం పెట్‌లోని ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ 17 మంది మందు బాబులకు సోమవారం బేగంపేట్‌లో కౌన్సిలింగ్ ఇస్తాము అని అన్నారు.