Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖాకీలకు ముచ్చెమటలు పోయించిన చెడ్డి గ్యాంగ్ అరెస్టు

Advertiesment
ఖాకీలకు ముచ్చెమటలు పోయించిన చెడ్డి గ్యాంగ్ అరెస్టు
, సోమవారం, 30 డిశెంబరు 2019 (15:10 IST)
ఖాకీలకు ముచ్చెమటలు పోయించి, నిద్రలేకుండా చేసిన చెడ్డి గ్యాంగ్‌ను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ పగటిపూట బొమ్మలమ్ముకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రిపూట దోపిడీలకు పాల్పడుతూ వచ్చారు. 
 
గ్యాంగ్ సభ్యులంతా 25 సంవత్సరాల లోపు వయసు గల యువతే కావడం గమనార్హం. ఈ ముఠాపై హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 14 కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 
 
గ్యాంగ్ నుంచి 150 గ్రాముల బంగారం, 3వేల నగదు, 4 వందల గ్రాముల వెండితోపాటు మొత్తం 6.55 లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులంతా వెస్ట్ బెంగాలు రాష్ట్రానికి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

ప్రస్తుతం వీరంతా మహారాష్ట్ర అకోలాలో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతబడులకు ఉపయోగించే పాము అక్కడ దొరికింది.. ధర రూ.1.25 కోట్లు