జనమా.. సంద్రమా? తూర్పులో జగన్‌కు స్వాగతం ఎలా ఉందో మీరూ చూడండి (వీడియో)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర... రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో ఆనాటి ప్రతిపక్ష నేత హోదాలో ఇదే మార్గం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. నాడు వైఎస్‌కు స్వాగతం పలికిన విధంగానే నేడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు.
రాజమండ్రిపై రైల్ కమ్ రోడ్డు జై జగన్ అంటూ ఇచ్చిన నినాదాలతో బ్రిడ్జి అదిరిపోయింది. బ్రిడ్జిపై కనుచూపు మేరలో ఎటు చూసినా జన సందోహమే. గోదావరి నదిలో కూడా రెండు వైపులా కిలోమీటర్ల కొద్ది సుమారు 500 పడవులు పార్టీ జెండాలు రెపరెపలాడించాయి. గతంలో పాదయాత్ర పేరుతో తూర్పు గోదావరి జిల్లాలోకి ఎవరు వచ్చినా ఈ స్థాయిలో స్వాగతం కనబడలేదని వైసీపీ శ్రేణుల ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.