బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లుగా ఇసుకు, ఖనిజం, సున్నపురాయి.. నారా లోకేశ్
గత నాలుగేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా రూ.34 వేల కోట్లను దోచుకున్నారంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నా
గత నాలుగేళ్ల కాలంలో వివిధ ప్రాజెక్టుల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు ఏకంగా రూ.34 వేల కోట్లను దోచుకున్నారంటూ వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
'సహజ వనరులు దోచుకుంటున్నారని 13 కేసుల్లో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో మీరు దోచుకోకుండా మిగిల్చింది ఏదైనా ఉందా? ఇసుక, ఖనిజాలు, సున్నపురాయి వంటి ఖనిజ సంపదలను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లా మింగేశారు' అని ఎద్దేవా చేశారు. మొత్తం 13 ఛార్జిషీట్లలో ఆయన దోచుకున్న మెనూ మొత్తం ఉందన్నారు.
అయితే, జగన్ మోహన్ రెడ్డి చేసిన నిధుల దోపిడీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇంకా స్పందించలేదు. వారు రంగంలోకి దిగితే జగన్‌పై ఎన్ని రకాల ఆరోపణలు చేస్తారో వేచి చూడాల్సిందే.