Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో హోటళ్లు అర్థరాత్రి 12 గంటల వరకూ తెరిచే వుంటాయి... ఎందుకు?

అమరావతి : గురువారం వెలగపూడి సచివాలయంలోని కార్మికశాఖ మంత్రి కార్యలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో కార్మిక, ఉపాధి కల్పన శాఖా మాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోటల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత

ఏపీలో హోటళ్లు అర్థరాత్రి 12 గంటల వరకూ తెరిచే వుంటాయి... ఎందుకు?
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (19:54 IST)
అమరావతి : గురువారం వెలగపూడి సచివాలయంలోని కార్మికశాఖ మంత్రి  కార్యలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో కార్మిక, ఉపాధి కల్పన శాఖా మాత్యులు శ్రీ పితాని సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోటల్  అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో హోటల్స్ నిర్వహణకు సంబంధించి రాత్రి సమయంలో 10 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు కల్పించటం జరిగిందని, రాత్రి వేళలో హోటల్స్ నిర్వహణ సమయంను రాత్రి 12 గంటల వరకు పోడిగించేలా చూడాలని హోటల్  అసోసియేషన్ సభ్యులు మంత్రి పితాని ని కోరారు. 
 
ఈ నేపధ్యంలో మంత్రి, పోలిస్ శాఖా అధికారులు మరియు కార్మిక శాఖా అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మట్లాడుతూ... ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్స్ మరియు మున్సిపాలిటిలలో ప్రభుత్వం నుండి అధికారికంగా నమోదు చేయించుకుని ప్రభుత్వ అనుమతులు ఉన్నటువంటి హోటల్స్‌లో రాత్రి 12 గంటల వరకు నిర్వహించేలా మంత్రి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మిక చట్టాల ప్రకారం ప్రతి కార్మికుడి పని వేళలు 8 గంటలకు మించి ఉండకూడదనీ, వారంలో ఒకరోజు సెలవు రోజుగా ప్రకటించాలనీ, పనివేళలకు మించి పనిచేస్తే ఓటీ కల్పించాలని, రాత్రివేళలో పనిచేసే కార్మికులకు వారికి అనుగుణంగా విశ్రాంతి గదులు కల్పించాలని, అలానే మహిళా కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళకు సెక్యూరీటి కల్పించే బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని హోటల్ అసోసియేషన్ సభ్యులకు మంత్రి సూచించారు. 
 
ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న సందర్బంలో రాత్రివేళలో ఫుడ్ కోర్ట్స్ నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో అనుమతులు కల్పించటం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన జీవోను అధికారికంగా వారంలోపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శాఖాధికారులను ఆదేశించారు. ఈ నేపధ్యంలో మంత్రి సానుకూలంగా స్పందించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్మికశాఖ కమిషనర్ వరప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావ్ భూపాల్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు యమ్ శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

“కెసీర్ హటావో... తెలంగాణ బచావ్” ఇదే మా నినాదం... కాంగ్రెస్