Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. మగబిడ్డ జననం

వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరా

Advertiesment
12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. మగబిడ్డ జననం
, సోమవారం, 27 ఆగస్టు 2018 (14:06 IST)
వజ్రాల నగరంలో దారుణం జరిగింది. 12 యేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భందాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లా కక్రపార్ అనే గ్రామానికి చెందిన 40 యేళ్ల కామాంధుడుకి భార్య, ఓ కుమార్తె ఉంది. భర్త వేధింపులు భరించలేని భార్య... తన కుమార్తెతో కలిసి కటర్గామ్ అనే ప్రాంతంలో నివశిస్తోంది. ఈ భార్యాభర్తలు గత ఐదేళ్లుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
అయితే, పాఠశాల సెలవు రోజుల్లో తండ్రిని చూసేందుకు 12 యేళ్ల బాలిక కక్రపార్ గ్రామానికి వెళ్లివచ్చేది. ఈ క్రమంలో కన్నబిడ్డపై కన్నేసిన కామాంధుడు... అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీయగా జరిగిన వాస్తవాన్ని వెల్లడించింది. 
 
దీంతో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కామాంధ తండ్రిని అరెస్టు చేశారు. కాగా, ఆ బాలిక వద్ద జరిపిన పోలీసు విచారణలో గతంలోనే 28 యేళ్ల తన మేనమాన అత్యాచారం చేశాడని వెల్లడించింది. దీంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొడ్డు మాంసం తిన్నారుగా.. చూశారా.. కేరళ ఏమైందో? బసన‌గౌడ్