Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 రాష్ట్రాలను చుట్టేస్తూ అత్యంత దూరం ప్రయాణించే రైలు ఏది..?

ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ

Advertiesment
indian railway
, సోమవారం, 27 ఆగస్టు 2018 (15:51 IST)
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో వ్యవస్థగా భారతీయ రైల్వేకు స్థానముంది. భారతీయ రైల్వేలో వేలాది రైళ్లు దేశం నలుమూలల తిరుగుతూ కోట్లాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైలు బండ్లు వేల సంఖ్యలో ఉన్నా... ఒకటి రెండు రైళ్ళ గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ రెండు రైలు బండ్లు మాత్రమే అత్యంత దూరం ప్రయాణిస్తుంటాయి. అలాంటి వాటిలో వివేక్ ఎక్స్‌ప్రెస్ ఒకటి కాగా, రెండోది హిమసాగర్ ఎక్స్‌ప్రెస్.
 
ఇది ఉత్తర అస్సోంలోని డిబ్రూగఢ్ - కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4233 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి, 55 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలును స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ రైలు లుథియానా, న్యూఢిల్లీ, భోపాల్, నాగపూర్, విజయవాడ, తిరుపతి, సేలం, కోయంబత్తూరు మొదలైన ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంటుంది. ఈ రైలు జర్నీ 80 గంటల 15 నిమిషాల పాటు సాగుతుంది. 
 
ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 3709 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి కన్యాకుమారి చేరుకునేందుకు ఈ ట్రైన్‌కు మొత్తం 71 గంటల 50 నిముషాలు పడుతుంది. ఈ రైలు మొత్తంగా 67 రైల్వే స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఈ రెండు రైళ్లు మాత్రమే దేశంలో సుదూర దూర ప్రయాణించే రైళ్లు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ ఉదయాన్నే పొన్న బెరడు కషాయాన్ని తీసుకుంటే?