Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ లోతుగా దర్యాప్తు చేయలేదట : హైకోర్టులో నేడు పిటిషన్

jagan
, శుక్రవారం, 13 అక్టోబరు 2023 (11:02 IST)
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తనపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా దర్యాప్తు చేయలేదని అందువల్ల ఈ కేసులో మళ్లీ లోతుగా దర్యాప్తు చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. నంబర్‌ను కేటాయించే సమయంలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి నేడు విచారణ చేపట్టనున్నారు.
 
కాగా, కోడికత్తితో తనపై దాడి జరిగిన ఘటనలో కుట్ర కోణం ఉందని సీఎం జగన్ గతంలో ఎన్ఐఏ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి, వాంగ్మూలాలు నమోదయ్యే దశలో ఆయన కోర్టును ఆశ్రయించారు. 
 
ఎన్ఐఏ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్ నిర్వహకుడు నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా పట్టించుకోకుండా విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఎన్ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్ కొట్టేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరుగుతుంది : నారా లోకేశ్