Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసులూ మీరు గుర్తున్నారు: అచ్చెం నాయుడు

Advertiesment
Hello police
, గురువారం, 21 జనవరి 2021 (22:15 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పోలీసులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జాగీరుల్లా మారిపోయారని మండిపడ్డారు. కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ప్రతిపక్షపార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్లు అక్రమ కేసులను బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
తిరుపతిలో ఈరోజు ధర్మపరిరక్షణ పేరుతో యాత్రను చేపట్టారు అచ్చెం నాయుడు. అయితే టిడిపి నేతలను యాత్ర చేయనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అచ్చెంనాయుడును హోటల్ లోనే నిర్బంధించారు. కార్యక్రమానికి బయలుదేరిన టిడిపి నేతలను అడ్డుకున్నారు. 
 
టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ అరెస్టులు చేసేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రానికి నేతలను విడిచిపెట్టారు. అయితే అచ్చెమనాయుడు మాత్రం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కావాలనే తమపై కేసులు పెడుతున్నారన్నారు. 
 
తమపై కేసులు పెట్టే ప్రతి ఒక్కరినీ ఖచ్చితంగా గుర్తించుకుంటామని.. అలాంటి వారిపై టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పదవీ విరమణ చేసేస్తాం.. ఇక మనం వెళ్ళిపోతాం.. మనల్ని ఏమీ చేయలేరులే అనుకుంటే పొరపాటే.. టిడిపి కార్యకర్తలను ఏ పోలీసు అధికారి ఇబ్బందులకు గురిచేసినా వదిలిపెట్టేది లేదన్నారు అచ్చెమనాయుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈసారి సీటు బిజెపికి ఇచ్చేద్దాం, సహకరించండి: జన సేనాని