Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెడ్మాస్టర్ కాదు.. కామాంధుడు.. కోర్కె తీర్చమని వేధింపులు

Advertiesment
Headmaster
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:01 IST)
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో ఓ విద్యార్థినిలను వేధిస్తున్న హెడ్మాస్టర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. తన వద్ద చదువు కోసం వచ్చే విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేకాకుండా, ఎవరూ లేనిసమయంలో కోర్కె తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను తాళలేని పాఠశాల విద్యార్థినులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే జిల్లాలోని బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా వెంకటరాం రెడ్డి పని చేస్తున్నాడు. ఈయన విద్యార్థినిల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ పలువురు విద్యార్థినులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. లిఖిత పూర్వకంగా ఆయనపై ఫిర్యాదు చేశారు. 
 
చదువు పేరుతో తిట్టడం, కొట్టడంతో పాటు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఐదుగురు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో, బాలల హక్కుల సంఘం నేతలు షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకటరాంరెడ్డి మాట్లాడుతూ, కొంత మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు తనపై కక్షకట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెక్చరర్ ఇంట్లో విద్యార్థిని సూసైడ్.. ప్రేమ వ్యవహారమేనా?