Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతి వృత్తులు చితికిపోతున్నాయ్!

Advertiesment
చేతి వృత్తులు చితికిపోతున్నాయ్!
, బుధవారం, 21 జులై 2021 (12:52 IST)
క‌రోనా ఉప‌ద్ర‌వంతో, ఆర్ధికంగా సంక్షోభంతో క‌మ్మ‌రం, కుమ్మ‌రం, వ‌డ్రంగం, బంగారం, శిల్పం వంటి చేతి వృత్తులు చితికిపోతున్నాయ‌ని రాయలసీమ విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక క‌న్వీన‌ర్ చేజర్ల మనోహరాచారి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తిరుప‌తిలో రాయలసీమ విశ్వబ్రాహ్మణ ఐక్య వేదిక స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. 
 
 భారతీయ ఖ్యాతిని ఖండాంతరం చేసిన విశ్వబ్రా హ్మణుల వృత్తులు ‘చితి’కిపోతున్నాయ‌ని, 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలైన చేతి వృత్తుల వారు ఆకలితో అలమటిస్తున్నార‌ని చెప్పారు.   సరళీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఏర్పడే పోటీకి తట్టుకోలేక, జీవనభృతిని కోల్పోతున్న చేతి వృత్తుల వారి సమస్యలకు ప్రభుత్వం తగిన  పరి ష్కారం చూపడంలేద‌ని ఆరోపించారు. గ్రామీణ ప్రాంత పంచవృత్తుల విశ్వబ్రాహ్మణులు జీవనవిధానం అగమ్యగోచరంగా తయారైంద‌న్నారు. ఇటీవలి వరకు గ్రామీణ ప్రాంతాల్లో దుక్కి దున్నాలి.

నాగలికర్రు సరిచేసి పెడతావా అనే పలకరింపులు వినిపించేవి. కానీ ప్రస్తుతం పల్లెను చుట్టుముడుతున్న యాంత్రీకరణ, కార్పొరేట్ సంస్థల హవాతో చేతి వృత్తులే క‌నుమ‌రుగు అవుతున్నాయ‌ని తెలిపారు. చేతి వృత్తుల వారు పూర్వవైభవం పొందాలంటే, ప్రభుత్వాలు  ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటం, కుల వృత్తులను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాల‌న్నారు. 

ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో 135 నామినేటెడ్  పదవులలో, 13 జిల్లాల నుంచి  రాష్ట్ర హోదా క‌లిగిన ఛైర్మ‌న్ పదవి కానీ, కనీసం జిల్లా హోదా నామినేటెడ్ పదవి గానీ ఒక్కటి కూడా విశ్వబ్రాహ్మణులకు కేటాయించక పోవడం చాలా బాధాకరమ‌న్నారు. ఇకనైనా రాజకీయ పార్టీలకు అతీతంగా సమిష్టిగా పోరాడి త‌మ డిమాండ్ల‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాల‌ని తెలియజేయడానికి కార్యా చరణ రూపొందించు కొనే ప్రయత్నం ప్రారంభించాలని రాయలసీమ ఐక్యవేదిక క‌న్వీన‌ర్ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగ‌ళ‌గిరి యువసేన లోకేష్ బాబును గ‌బ్బుప‌ట్టిస్తోందా?