Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గవర్నర్ కోటాలో ఇద్దరు వైకాపా నేతలకు ఎమ్మెల్సీ ఛాన్స్

andhra pradesh map
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (10:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో ఇద్దరు పార్టీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో వీరిద్దరిని శాసనమండలి సభ్యులుగా చేశారు. వీరిలో ఒకరు కర్రి పద్మశ్రీ కాగా, మరొకరు కుంభా రవిబాబులు ఉన్నారు. వీరిద్దరినీ గవర్నర్ కోటాలా ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 
 
గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీలుగా ఉన్న చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎం.డి ఫరూక్ పదవీకాలం గత నెల 20వ తేదీతో ముగిసింది. ఆ ఖాళీలను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నామినేట్ చేసిన పద్మశ్రీ, రవిబాబులలతో భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎక్స్‌అఫిషియో ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. 
 
ప్రేమకు అడ్డొస్తున్నాడనీ తండ్రి కాళ్లు విరగ్గొట్టిన కుమార్తె.. ఎక్కడ? 
 
తన ప్రేమకు అడ్డొస్తున్నాడని కన్నతండ్రినే మట్టుబెట్టాలని ఓ కుమార్తె చూసింది. ఇందులోభాగంగా, కొందరు కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిన తండ్రి కాళ్లు విరగ్గొట్టింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మధ తాలూకాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ తాలూకాకు చెందిన మహేంద్ర షా అనే వ్యక్తి స్థానికంగా ధనవంతుడు. పైగా వ్యాపారవేత్త కూడా. ఆయన కుమార్తె సాక్షి. ఈమె చైతన్య అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో తమకు అడ్డుగా ఉన్న తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న నిర్ణయించింది. ఇందులోభాగంగా, రూ.60 వేల సుపారీ ఇచ్చి నలుగురు రౌడీలను రంగంలోకి దించింది. వారితో తండ్రి కాళ్లు విరగ్గొట్టించేందుకు భారీ కుట్ర పన్నింది.
 
ఈ క్రమంలో తొలుత పూణెకు వెళ్లి ఆదివారం రాత్రి మధకు వచ్చింది. స్థానిక బస్టాండ్‌కు చేరుకున్నాక తండ్రికి ఫోన్ చేసి వచ్చి ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కూతురి పన్నాగం తెలియకపోవడంతో తండ్రి కారులో వచ్చి కుమార్తెను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో మూత్ర విసర్జన చేయాలంటూ తండ్రికి చెప్పి, కారును వాడచివాడి గ్రామంలో ఆపాలని ఆమె కోరింది. అప్పటికే వారి కారు కోసం కొందరు వెంబడిస్తున్నారు. ఈ విషయం తెలియని ఆయన కూతురు చెప్పినట్టు కారు ఆపారు. 
 
వారిని వెంబడిస్తున్న దుండగులు యువతి అలా పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మహేంద్ర షాపై దాడి చేసి కిరాతకంగా చావబాదారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు కూడా విరిగిపోయాయి. ఈ దాడిలో ఆయన తనకు తీవ్ర గాయమైంది. దెబ్బలు తాళలేక ఆయన ఆర్తనాదాలు చేయడంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కుమార్తె కుట్ర కోణం వెలుగు చూసింది. దీంతో ఆమెతో పాటు ఈ దాడిలో పాల్గొన్న నలుగురు దుండగులు, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మహేంద్ర షా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో ఆటోలో వెళ్తున్న నవవధువును ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?