ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటికే రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్టుగానే వాలంటీర్ల చర్యలు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలపై లైంగికదాడులు, హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వాలంటీర్ మహిళను మోసం చేశారు. ఆమె వేలి ముద్రలతో బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.1.70 లక్షల నగదును కాజేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యాలగూడెంలో జరిగింది.
ఈ గ్రామానికి చెందిన కొట్ర నాగమణి ఇటీవల తన బ్యాంకు ఖాతాలో రూ.13500 నగదు జమ చేసింది. ఠఆ తర్వాత తన ఖాతాలో మొత్తం ఎంత ఉందని బ్యాంకు సిబ్బందిని అడగ్గా ఇపుడు జమచేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది.
ఇటీవల తానెప్పూడ నగదును విత్ డ్రా చేయలేదని అధికారులకు చెప్పడంతో వారు బ్యాంకు ఖాతా వివరాలు, స్టేట్మెంట్లను పరిశీలించగా, వాలంటీర్ బండారం బయటపడింది. వేలిముద్ర ద్వారా రూ.1.70 లక్షలు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసినట్టు గుర్తించారు. వాలంటీరు తన వేలిముద్రలు తీసుకుని నగదు డ్రా చేసిన మోసం చేశారంటూ బాధితురాలు వాపోయింది. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.