భారత ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పలు పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేసింది. అలాగే, భారత రాష్ట్ర సమితికి కూడా తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీని తెలంగాణ ప్రాంతీయ పార్టీగా గుర్తించింది. పైగా, ఏపీలో ఆ పార్టీకి జాతీయ హోదాను రద్దు చేసింది. అదేసమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం జాతీయ హోదాను కల్పించింది. జాతీయ హోదాను కోల్పోయిన పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఎన్సీపీలు ఉన్నాయి. ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఈ పార్టీల నేతల తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఆప్ విషయానికి వస్తే ఢిల్లీలో పురుడు పోసుకున్న ఈ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది.
ముఖ్యంగా, గత యేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఏకంగా ఐదు చోట్ల విజయం సాధించి, తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ బరిలో దికిన తొలిసారే ఏకంగా ఐదు స్థానాల్లో గెలుపొందడం సాధారణ విషయం కాదు. మరోవైపు, సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీలకు జాతీయ హోదాను రద్దు చేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీల నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. మరోవైపు, ఏపీలో భారత రాష్ట్ర సమితికి జాతీయ హోదాను ఉపసంహరించుకుంది.