Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మగ్లర్ వీరప్పన్‌కు సీఎం జగన్‌కు తేడా లేదు : పవన్ కళ్యాణ్

pawan kalyan
, గురువారం, 10 ఆగస్టు 2023 (22:31 IST)
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్మగ్లర్ వీరప్పన్ అమాయకులైన గిరిజన ప్రజలతో గంధపు చెక్కలను నరికి స్మగ్లించే చేయించేవారన్నారు. నిజానికి గంధపు చెక్కలు నరకడం నేరమని గిరిజన ప్రజలకు తెలియదన్నారు. అలాంటి పనినే జగన్ వాలంటీర్లతో చేయిస్తున్నారని అన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలు, డేటాను సేకరించడం తీవ్రమైన నేరమన్నారు. ఈ పనిని సీఎం జగన్ చేయిస్తున్నారని, అందువల్ల వాలంటీర్లు ఖచ్చితంగా చిక్కుల్లో పడతారని చెప్పారు. 
 
విశాఖలో జరిగిన వారాహి మూడో దశ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ, ఏపీలో ప్రజల డేటా దుర్వినియోగమవుతుందని చెప్పారు. దీనికి కారణం వాలంటీర్ వ్యవస్థేనని చెప్పారు. వాలంటీర్లకు ఓటీపీలతో పనేంటి అని ప్రశ్నించారు. ఓటీపీ అడిగి మొన్న రాజమండ్రిలో డబ్బు దోచుకునే ప్రయత్నం చేశారన్నారు. కొయ్యలగూడెంలో ఒక వాలంటీర్ మహిళ వేలిముద్రతో బ్యాంకు ఖాతా నుంచి రూ.1.70 లక్షలు విత్ డ్రా చేసుకున్ని కాజేశాడని చెప్పారు. పెందుర్తిలో ఒక వాలంటీర్ వృద్ధురాలిని చంపి నగలు దోచుకున్నారన్నారు. అసలు వ్యక్తిగత డేటాను సేకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
 
అదేసమయంలో తాను వాలంటీర్ వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతుంటే వైకాపా నేతలు మరోలా వక్రీకరిస్తున్నారన్నారు. సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా.. వాలంటీర్ల పొట్టకొట్టాన్నది తన ఉద్దేశం కాదన్నారు. అవసరమైతే మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే వ్యక్తిని తాను. కానీ, మీతో జగన్ తప్పు చేయిస్తున్న విషయాన్ని గుర్తించండి. ఈ విషయాన్నే తాను ఎత్తి చూపుతున్నాను. ప్రజల నుంచి సేకరించిన ఆధార్, బ్యాంకు, ఇతర వివరాలను నానక్ రామ్ గూడలోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్... నిన్ను కేంద్రంతో కలిసి ఓ ఆటాడుకుంటా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక