Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కారు

toor dall
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్దిదారులకు ఏపీ జగన్మోహన్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించారని ఆదేశించింది. ఇందుకోసం సంక్రాంతి పండుగకు 8 వారాల ముందు కంది పప్పును కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. 
 
జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. అటు తొలిసారిగా రాష్ట్రంలో కందిపంటను పండించిన రైతుల నుంచి ఈ కందిపప్పును కొనుగోలు చేయాలని సరఫరా చేయనుంది. డిసెంబరు నెలలో 46.64 లక్షల మందికి సుమారు 4604 టన్నుల కందిపప్పును కిలో రూ.67కే అందించనుంది. అలాగే, గిరిజన ప్రాంతాల్లో కంది పప్పు సబ్సీడీ ద్వారా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కాగా, దేశవ్యాప్తంగా గత యేడాది కాలంగా కందిపప్పు ధరలు చుక్కలను తూకుతున్న విషయం తెల్సిందే.
 
అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కందిపట బాగా దెబ్బతిన్నది. ముఖ్యంగా మహారాష్ట్రంలో ఈ పంటకు అపారనష్టం వాటిల్లింది. దీంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త పంట వస్తుండటంతో ధరలు దిగివస్తున్నాయి. కిలో కందిపప్పును రూ.115 ఉన్నపుడు సబ్సీడీపై రూ.67కే విక్రయించిన ప్రభుత్వం ఆ తర్వాత కందిపప్పు ధర రూ.170కి చేరినప్పటికీ సబ్సీడిని మాత్రం తగ్గించలేదు. మధ్యలో 3, 4 నెలల్లో మార్కెట్‌లలో లోటు ఉండటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు - 8 రైళ్లను రద్దు చేసిన దక్షిణ రైల్వే