Publish Date: Wed, 14 Sep 2022 (11:06 IST)
Updated Date: Wed, 14 Sep 2022 (11:07 IST)
గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతోంది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు50 అడుగులకు చేరింది. ఈ ఏడాది గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరడం ఇది నాలుగోసారి.
జులై 16న గరిష్ఠంగా 71.3 అడుగులు, ఆగస్టు 12న 52.5, 17న 54.5 అడుగులు మార్కును గోదావరి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 51.60 అడుగులతో 13లక్షల 49 వేల 565 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. భద్రాచలం-పేరూరు మధ్య తూరుబాక, పర్ణశాల, ఆలుబాక, గంగోలు రోడ్లపై నీరు చేరింది.
బూర్గంపాడు మండలం సారపాక, అశ్వాపురం మండలం రామచంద్రాపురం, నెల్లిపాక బంజర వద్ద కూడా రోడ్లు మునిగాయి. భద్రాచలం నుంచి చత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
సెల్వి
Publish Date: Wed, 14 Sep 2022 (11:06 IST)
Updated Date: Wed, 14 Sep 2022 (11:07 IST)