Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుపాను పట్ల పూర్తి అప్రమత్తం ..కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

తుపాను పట్ల పూర్తి అప్రమత్తం ..కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు:  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
, గురువారం, 26 నవంబరు 2020 (16:56 IST)
నివర్ తుపాను పట్ల నియోజక వర్గ వ్యాప్తంగా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయం నందు బుధవారం  కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బుధవారం అర్ధరాత్రి, గురువారం  తెల్లవారు జామున  3 గంటల  వరకూ  అధికారులకు 5 ఫోన్ కాల్స్ వచ్చాయని,అధికారులు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తూ సమస్యలును పరిష్కరిస్తూ,ముందస్తు చర్యలు చేపట్టారన్నారు.దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు నివాసాలు వుండొద్దని ఆయన సూచించారు.

బుధవారం నుంచి సంబేపల్లె లో 145 ఎంఎం వర్షపాతం, రాయచోటి పట్టణంలో 85 ఎంఎం వర్షపాతం నమోదయిందన్నారు. నేడు, రేపు వర్షం ఉంటుందని ప్రజలందరూ జాగ్రత్తగా  ఉండాలన్నారు.గురువారం నాడు కార్మికుల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కార్మికులు విధులకు హాజరు కాకపోయినా మున్సిపల్ అధికారులు,సచివాలయ వాలంటీర్లు బయట నుంచి అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకుని సమస్యలు  లేకుండా కృషి చేస్తున్నారన్నారు.

నియోజక వర్గ పరిధిలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ, ఏ ఓ లు, సిబ్బంది పంటల పరిశీలనలో ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. చేతికొచ్చిన ధాన్యం ఈ వర్షానికి పాడవడంబాధాకరమన్నారు. రైతులకు సాయంగా ఉంటామన్నారు.

వర్షాలతో  పట్టణంలో ఉత్పన్నమయ్యే సమస్యలును ఎదుర్కొని  వీలైనంతవరకు సమస్యలు లేకుండా చేస్తామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ సమయంలో నైనా   ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకు  ఫోన్ చేయాలని, ప్రజారోగ్యశాఖ   08561-251525 & 9866200722  నెంబర్లకు ఫోన్ చేయాలని శ్రీకాంత్ రెడ్డి  సూచించారు.

అధికంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, కుంటలు ఎక్కడైనా దెబ్బతిన్నా తక్షణమే  సచివాలయ,  రెవెన్యూ అధికారులకు తెలియపరచాలన్నారు. అత్యవసర సమయాలలో తన ఫోన్ నెంబర్ 9866504367  కు  శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పియాజ్జియో ఇండియా నుంచి త్వరలో ప్రీమియం స్కూటర్‌ ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160