తుపాను తీవ్రత తగ్గేవరకు పైన సూచనలు పాటించాల్సిందిగా విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.
• మీ ఇల్లు సురక్షితంకాకపోతే ముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టరుకు చేరుకోండి.
• భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నప్పుడు తలుపులు మరియు కిటికీలను సురక్షితంగా మూసివేయండి.
• అదే విధంగా ఇంట్లో వస్తువులు కదలకుండా ఉండేవిధంగా తగుజాగ్రత్తలు తీసుకోండి. అవి మీద పడే అవకాశం ఉంటుంది.
• వాతావరణ హెచ్చరికలను గమనిస్తు ఉండండి. రేడియో/టీవీన్యూస్ చూడండి.
• ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు ఫోన్ చేసి పునరావాస కేంద్రాలు, ఇతర సమాచారం గురించి తెలుసుకోండి.
• పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగాఉండండి, భయపడవద్దు.
• భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో "అత్యవసర వస్తుసామగ్రిని" సిద్ధంచేసుకోండి.
• ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైనప్రదేశాలకు వెళ్ళండి.
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగడం మంచిది.
• భవనం కూలిపోవటం జరుగుతుంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే దుప్పట్లు, రగ్గులతో కప్పుకుని బలమైన టేబుల్/ బెంచి క్రిందకు దూరడం ద్వారా మిమ్మల్నిమీరు రక్షించుకోవచ్చు.
• దెబ్బతిన్న/పాతభవనాల్లోకి ప్రవేశించవద్దు. వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం/షెల్టరుకు చేరుకొండి.
• వాతావరణం ప్రశాంతంగా ఉంటే జాగ్రత్తగా నిశితంగా వేచిచుడండి, ఒక్కసారిగా పెద్ద/హింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవచ్చు, తుపాను తీవ్రత తగ్గినట్టు అధికారిక సమాచారం వచ్చెంత వరకు సహనంతో ఉండండి.