ఏసీబీ వలలో కృష్ణాజిల్లా మైలవరం ఫారెస్ట్ రేంజ్, ఏ.కొండూరు ఫారెస్ట్ సెక్షన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె.శేషకుమారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కె.శేషకుమారి, ఆమె భర్త సుధాకర్ (ప్రైవేట్ ఎంప్లాయ్) ఇద్దరూ కలిసి ఫిర్యాది అయిన జె.యేసు నాయక్, రుద్రవరం గ్రామం, రెడ్డిగూడెం మండలం, కృష్ణాజిల్లా వద్ద నుండి నాలుగు ఎకరాల ఫారెస్ట్ పొలం సాగు చేయుటకు రూఫర్ పట్టా కోసం జీపీఎస్ సర్వే నిర్వహించేందుకుగాను రూ.లక్ష డిమాండ్ చేసరు.
మొదటి విడతగా రూ.50వేలు లంచంగా అడిగి తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
లంచం డబ్బు మరియు సంబంధిత రికార్డులను స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.