Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి

road accident

ఠాగూర్

, బుధవారం, 6 మార్చి 2024 (08:01 IST)
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తిరుమల దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదానికి గురయ్యారు. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద వస్తుండగా, జాతీయ రహదారిపై రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా హైదరాబాద్ వాసులే. ఈ కారులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. 
 
అమిత వేగంతో వచ్చిన కారు బలంగా కారును ఢీకొట్టింది. దీంతో వారు చనిపోయారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సివుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులతో పాటు వారి ప్రాంతం తదితర వివరాలు తెలియాల్సివుంది. 

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి - జీవిత ఖైదును రద్దు చేసిన బాంబే హైకోర్టు 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసుల ప్రొఫెసర్ సాయిబాబను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికిందని ఆరోపించారు. ఆయన గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. 
 
అనారోగ్యంతో వీల్ చెయిర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14 తేదీన సాయిబాబాను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టి... ఈ కేసును మరోమారు లోతుగా విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. దీంతో మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిస్తూ, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశృతి.. ఒకరు మృతి