Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి మీరు ముఖ్యమంత్రి కాకుంటే మేం అడుక్కోవాల్సిందే.. బాబుతో రైతు కూలీలు

Advertiesment
chandrababu
, గురువారం, 27 ఏప్రియల్ 2023 (16:04 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో రైతు కూలీలు తమ గోడు వినిపించుకున్నారు. ఈ దఫా మీరు ముఖ్యమంత్రి కాకుంటే తాము అడుక్కోవాల్సిందేనంటూ వారు బోరున విలపిస్తూ చెప్పారు. 
 
పల్నాడు జిల్లా అమరావతి నుంచి సత్తెనపల్లి వెళుతూ మార్గమధ్యలో ధరణికోట - లింగాపురం మధ్య పొలాల్లో పని చేస్తున్న కూలీలను చూసి ఆగిన చంద్రబాబు.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. జగన్‌ బటన్‌ నొక్కినా తమ ఖాతాలలో నగదు పడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వచ్చిన కూలి సొమ్ముతో కుటుంబం గడుస్తుందా అని చంద్రబాబు ప్రశ్నించగా మహిళా కూలీలు నిత్యావసరాల ధరలు పెరిగాయని పప్పులు, ఉప్పు, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంటి పన్ను, చెత్తపన్ను వసూలు చేస్తోందన్నారు. 
 
గతంలో కౌలు కార్డుల ద్వారా రుణాలు వచ్చేవని, ఇప్పుడు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటే తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల తర్వాత మీరు ముఖ్యమంత్రి కాకుంటే తాము అడుక్కోవలసి ఉంటుంది.. మా జీవితాలు బాగుపడాలంటే మళ్లీ మీరే రావాలి అంటూ కూలీలు ముక్తకంఠంతో పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హత్య కేసు.. సీబీఐ దూకుడు.. మరో నలుగురి విచారణ