అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టు బోనెక్కుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకెళ్లడం ఖాయమంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నెటిజనకు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి త్వరలోనే జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయమంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసును లోతుగా దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారని, చట్టం ప్రకారం జరగాల్సింది జరుగుతుందన్నారు. తానూ అందరిలా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేనని అన్నారు.
ప్రతి కేసులోనూ విచారణ జరగడం, సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో సమర్పించడం.. వాటి ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుని శిక్ష విధించడటమా? లేక మరేదైననా అని తేలుస్తుందన్నారు. జగన్ కేసు విషయంలోనూ ఆ విధంగానే జరుగుతుందని చెప్పారు.
జగన్ అక్రమాస్తుల కేసులో తాను విచారణాధికారిగా ఉన్నపుడు అన్ని కేసులకు సంబంధించి చార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించడం జరిగిందని తెలిపారు. వాటిపై ట్రయల్స్ నడుస్తున్నాయని వివరించారు. ఇరు పక్షాల వాదనలు ప్రతివాదనల అనంతరం నేరం రుజువని తేలితే కోర్టు శిక్ష విధిస్తుందని, లేదంటే నిర్ధోషిగా ప్రకటిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.