Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమతి లేకుండా రూ.18 కోట్లు డ్రా చేసిన రవి ప్రకాష్ - ఈడీ కేసు

Advertiesment
TV9 Ex CEO
, గురువారం, 2 జులై 2020 (10:55 IST)
టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఆయన ముందుస్తు అనుమతి లేకుండా రూ.18 కోట్ల మేరకు విత్‌డ్రా చేసినట్టు ఈడీ గుర్తించింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసింది. 
 
టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి అనుమతుల్లేకుండా పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించినట్టు రవి ప్రకాష్‌పై ఆరోపణలు ఉన్నాయి. 
 
సెప్టెంబరు 2018 నుంచి మే 2019 వరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరు అనుమతుల్లేకుండా రూ.18 కోట్ల నిధులను విత్‌డ్రా చేసినట్టు కంపెనీ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరులో ఈ విషయంలో రవిప్రకాశ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.805 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.. జీవీకే గ్రూపు అధిపతిపై కేసు