కర్నూలు జిల్లా పిన్నాపురంలో పవన్ విసృతంగా పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా గ్రీన్‌కో సోలార్‌పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. పిన్నాపురం వద్ద ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు అని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు తగిన సహకారం అందించాలని కోరారు.
గ్రీన్‌కో దేశంలో రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెడుతోందని అందులో మన రాష్ట్రంలో రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. గ్రీన్‌కో సోలార్‌పవర్ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. మొత్తం 2,800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ భూమిపై రెవెన్యూ, అటవీశాఖ మధ్య చిన్న వివాదం వచ్చిందని ఆ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించామని తెలిపారు.
కేంద్రం అనుమతితో 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసిందని అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. ఫారెస్టు, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉందన్నారు.