Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Advertiesment
Ghatkesar Delhi Public School 6th anniversary

ఐవీఆర్

, శనివారం, 11 జనవరి 2025 (18:27 IST)
ఘట్కేసర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డిఆర్డిఏ శాస్త్రవేత్త డా. యోగేష్ కె. వర్మ, ఆర్ఎఫ్ సీకర్స్ ల్యాబొరేటరీలో డివిజన్ అధిపతి హాజరయ్యారు. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సమాజ సేవా దృక్పథం పెంపొందించడానికి డిపిఎస్ ఘట్కేసర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. డాక్టర్ యోగేష్ కె. వర్మ మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనలో యువత ఉత్సాహాన్ని గుర్తించడం, విద్యా రంగంలో వారి పాత్రను వివరించారు. 
 
కార్యక్రమంలో విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ వేడుకలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిభింభించే నృత్యం, కార్యక్రమ ముగింపు నృత్యం, ఇది సమాజానికి సందేశమిచ్చేలా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యాలు, కృషి ప్రస్ఫుటంగా కనిపించాయి.  
 
విద్యార్థుల విద్యా, క్రీడా, ఇతర రంగాలలో ప్రదర్శించిన ప్రతిభకు అవార్డులను ప్రదానం చేశారు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, డాక్టర్ యోగేష్ కె.వర్మ, రాఘవేంద్ర రెడ్డి మచ్చ, ప్రిన్సిపాల్ నీతు గుప్తా పూరి విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారికీ ఉత్తమ భవిష్యత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎస్ ఛైర్మన్ రాఘవేంద్ర రెడ్డి మచ్చ, డైరెక్టర్లు విజయపాల్ రెడ్డి, రాధికా రెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో ఎయిర్ ఫైబర్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియమ్ సేవలు