Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్‌..ఐదుగురు సూపరింటెండెంట్లు సహా 13 మంది

Advertiesment
Durga Gudi
విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే ఐదుగురు సూపరింటెండెంట్‌ స్థాయి సిబ్బందితో సహా మొత్తం 13 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం అందజేసిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూలీ పనులకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 20మందికి పైగా గాయాలు