శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా సాక్షాత్కరిస్తుంది.
వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి ... ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం.
ఈ రోజున వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు.