Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?

రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను.. ఆంబులెన్స్‌లో తరలించారు.. ఎక్కడ?
, శనివారం, 23 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే ఆంబులెన్స్‌లో రూ.2.71 కోట్ల గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వున్న అనేక మంది రోగులను ఆస్పత్రికి అతివేగంగా చేరవేసే ఆంబులెన్సుల్లో గంజాయి ప్యాకెట్లను వుంచి తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. 
 
విశాఖపట్నం మార్గం మీదుగా పెద్ద మొత్తంలో ఆంబులెన్స్ ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఆ మార్గం ద్వారా వచ్చిన ఆంబులెన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో 1,813 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు కనుగొన్నారు. 
 
ఈ గంజాయి విలువ దాదాపు రెండు కోట్ల 70 లక్షల మేర వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5వేల రెస్టారెంట్లను జాబితా నుంచి తొలగించిన జొమాటో