Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో భార్య కలుస్తోందని ఊహించుకున్న భర్త.. ఏం చేశాడంటే..?

Advertiesment
ప్రియుడితో భార్య కలుస్తోందని ఊహించుకున్న భర్త.. ఏం చేశాడంటే..?
, శనివారం, 24 నవంబరు 2018 (14:00 IST)
అది విజయవాడలోని పడమటలంక. ఆ ప్రాంతంలో ఉన్న అపార్టుమెంట్‌లో మహేష్‌, ప్రియాంకలు నివాసమంటున్నారు. సరిగ్గా మూడు నెలల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా వీరి జీవితం సాగుతోంది. మహేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నారు. అయితే ఉన్నట్లుండి వీరి జీవితంలో అనుకోని మలుపు. ప్రియాంక కనిపించకుండా పోయింది.
 
ప్రియాంక రోజూ తన తల్లి విమల, తండ్రి కిషోర్‌కు ఫోన్ చేస్తూ ఉండేది. అయితే ఒక రోజంతా ఫోన్ చేయలేదు. దీంతో విమలకు అనుమానం వచ్చింది. తన భర్త కిషోర్‌కు చెప్పింది. కిషోర్ అల్లుడు మహేష్‌కు ఫోన్ చేశాడు. ప్రియాంక కూరగాయల మార్కెట్‌కు వెళ్ళి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదని చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నేరుగా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
పోలీసులు విచారణ జరిపారు. మహేష్ తనకేం తెలియదని బుకాయించాడు. దీంతో ప్రియాంక ఎందుకు కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులను అడిగారు పోలీసులు. మహేష్‌తో పెళ్ళి చేయకముందు సందీప్ అనే యువకుడిని ప్రియాంక ప్రేమించిందని, అయితే అతనికి ఉద్యోగం లేకపోవడంతో మహేష్‌కు ఇచ్చి వివాహం చేశామని చెప్పారు. దీంతో సందీప్‌పై అనుమానం పెట్టుకున్న పోలీసులు అతడిని విచారించారు. కానీ సందీప్ తనకే పాపం తెలియదన్నాడు. 
 
దీంతో ప్రియాంక ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపారు. దాని ఆధారంగా అసలు విషయం బయటపడింది. ప్రియాంక ఫోన్ ఇంట్లోనే ఉంది. పోలీసులకు మహేష్ పైన అనుమానం వచ్చింది. అతడిని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి తన భార్య చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందన్న అనుమానం తనలో కలిగిందని చెప్పాడు. 
 
ఒకరోజు సందీప్ తన భార్య సెల్‌కు ఫోన్ కూడా చేయడంతో తానే లిఫ్ట్ చేసి మాట్లాడినట్లు చెప్పాడు. అందుకే తన భార్యపైన అనుమానం పెట్టుకున్నానని, ప్రియాంకను తానే గొంతు నులిమి చంపేశానని ఒప్పుకున్నాడు. అంతేకాదు ప్రియాంక శవాన్ని మురికినీటి కాలువలో పడేశానని కూడా పోలీసుల ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తొంగుంటే.. ఆయన మనవడు సెక్రటేరియట్‌లో గోటీలు ఆడుతాడు.. రేవంత్ కన్నీరు