రాష్ట్రంలోని మిగిలిన కులాలను డమ్మీ చేసి కేవలం పెత్తందారీ వ్యవస్థ మాత్రమే నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పైగా, రాష్ట్రంలోని 13 జిల్లాలను కేవలం ముగ్గురుకి పంచేశారని ఆరోపించారు.
అంతేకాకుండా, వైఎస్ఆర్ అనే అక్షరాలకు దేవినేని కొత్త అర్థం చెప్పారు. 'వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీబాబాయ్)కి 5 జిల్లాలు, ఎస్-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారని ఆరోపించారు.
అంతేకాకుండా, సెర్చ్ కమిటీలో 12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అంటూ దేవినేని ఉమమహేశ్వర రావు నిలదీశారు. పార్టీ బాధ్యతలు, రాష్ట్రంలోని ముఖ్య వ్యవహారాలు ముగ్గురికే ఇచ్చారని విమర్శలు గుప్పించారు.
మిగతా కులాలను డమ్మీ చేశారని, రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయం సజ్జల రామకృష్ణా రెడ్డికి, అనుబంధ విభాగాలు విజయసాయి రెడ్డికి అప్పగించారని దేవినేని ఉమ ఆరోపించారు.