Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తపాలా ద్వారా స్మార్ట్ కార్డులు పంపిణి

తపాలా ద్వారా స్మార్ట్ కార్డులు పంపిణి
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:09 IST)
విజయవాడ రవాణా శాఖ పరిధిలో గల వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన స్మార్ట్ కార్డులను పోస్టు ద్వారా పంపించడం జరుగుతుందని, సరైన చిరునామాలో యజమానులు లేకపోవడంతో నేరుగా కార్యాలయానికి తిరిగిరావడం జరుగుతుందని, అటువంటి స్మార్ట్ కార్డులను నేరుగా యజమానులకు అందజేసే ప్రక్రియ స్పందన కార్యక్రమం ద్వారా చేపట్టుతున్నామని డిటిసి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు.

స్థానిక బందరు రోడ్లులోని, డిటీసీ కార్యాలయం నుండి మంగళవారం ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసారు. డిటీసీ మాట్లాడుతూ- డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లకు సంబంధిత స్మార్ట్ కార్డులు యజమానులు ప్రస్తుత చిరునామాలు నమోదు చెయ్యలేకపోవడం వలన స్మార్ట్ కార్డులు ఎక్కువ సంఖ్యలో తిరిగి వస్తున్నాయని, అటువంటి స్మార్ట్ కార్డులను నేరుగా యజమానులకు ఇచ్చే పక్రియ బుదవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ పరిపాలనాధికారి పరివేక్షణలో ఇవ్వబడతాయని, యజమానులు వచ్చేటప్పుడు వారి గుర్తింపు దృవపత్రాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిటీసీ ఎస్ వెంకటేశ్వరవు కోరారు. డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్ సంబంధించిన పనుల నిమిత్తం వచ్చిన దరఖాస్తుదారులను క్రితపు చిరునామాలొనే ఉంటున్నారా లేదా చిరునామా మరేరా అని అడిగి తెలుసుకోవాలని సి ఎస్ సి సెంటర్ నిర్వాహకులను కోరారు. 

ఎక్కువ సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్సులకు , వాహన రిజిస్ట్రేషన్ బదిలీలు, ఫైనాన్స్ సంబంధిత లావాదేవీలు పనులు జరుగుతున్నప్పుడు ప్రస్తుత చిరునామాలను నమోదు చేయకపోవడం వలనే స్మార్ట్ కార్డులు తిరిగి కార్యాలయమునకు వస్తున్నాయని ఆయన తెలిపారు.

డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్ సంబంధిత పనులు కొరకు దరఖాస్తు చేసుకునేవారు చిరునామా మార్పు కొరకు కూడా దరఖాస్తు చేసుకోని ప్రస్తుత చిరునామాను నమోదు చేయాలని డిటిసి కోరారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాహన డీలర్లు ఆధార్ కార్డులో ఉన్న చిరునామాను ప్రస్తుత చిరునామాలుగా పరిగణించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, కానీ ప్రస్తుత చిరునామాను ఆడిగితేలుసుకొని ఆధార్ కార్డులో ఉన్న చిరునామా కాకపోతే, ప్రస్తుత చిరునామాను నమోదు చేస్తూ, నివాస ధ్రువీకరణ పత్రం ఏదైనా జతపరచాలని డిటీసీ అన్నారు.

రవాణాశాఖ సంబంధిత సేవలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల లోపు స్మార్ట్ కార్డు మీ చిరునామాకు రాకపోతే మీయొక్క గుర్తింపు కార్డుతో కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని డిటీసీ కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్..డీజీపీ