సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి షూని పాలిష్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
సామాన్యుడు చెప్పులు కాలికి కాకుండా నెత్తిపై పెట్టుకుని వెళ్ళే దుస్థితికి కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. సామాన్యుడు బట్టలు కూడా వేసుకునే పరిస్థితి ఇక లేదన్నారు. జిఎస్టీలతో సామాన్యుడిని ఎన్నో ఇబ్బందులు కేంద్రప్రభుత్వం చేస్తోందన్నారు.
ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి వట్టి చేత్తో సిఎం తిరిగి రాకూడదన్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రయోజనాలపై పిఎంను అడగాలన్నారు. ప్రత్యేక హోదా, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రశ్నించాలన్నారు. చెప్పులపై జిఎస్టీ వేయడం దారుణమన్నారు.
కార్పొరేషన్ కంపెనీలకు కొమ్ము కాయడం, నిరుపేదలను ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నించారు. సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై స్పందించాలన్నారు. కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.
గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. రామకుప్పంలో ఎస్సి, ఎస్టిలపై రెడ్డి సామాజిక వర్గం దాడులకు దిగడాన్ని ఖండించారు.