Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటానంటున్న ఎపి మంత్రి

Advertiesment
నాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటానంటున్న ఎపి మంత్రి
, సోమవారం, 30 మార్చి 2020 (23:20 IST)
అసలే విపత్కరమైన పరిస్థితి. ప్రజలు కరోనా వైరస్ అంటేనే భయపడిపోతున్నారు. దీన్నే కొంతమంది ఆసరాగా చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులను బ్లాక్ లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలు, కూరగాయలు, మిగిలిన నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. 
 
ఎపిలోని కొన్ని జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎవరైనా సరే అధిక ధరలకు షాపుల యజమానులు విక్రయించినట్లు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తాం. షాపుల యజమానులు జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు ఎపి వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని.
 
తిరుపతిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమిష్టిగా పనిచేస్తున్న తీరు ప్రసంశనీయమన్నారాయన. 
 
ఇప్పటి వరకు 23పాజిటివ్ కేసులు మాత్రమే ఎపిలో నమోదయ్యాయని..వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు మంత్రి. ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని, వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఎవరైనా ఎక్కడైనా నిత్యావసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే తనకు ఫోన్ చేయాలని కోరారు. తన నెంబర్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుందని..ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి ఆలయంపై దుష్ప్రచారాలు నమ్మకండి, పెద్దజియ్యర్ స్వామి