ఏపీ - తెలంగాణ బోర్డర్ దగ్గర పోలీస్ బాస్, తమిళనాడు నుంచి వచ్చిన 50 మందికి క్వారంటైన్

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:31 IST)
జగ్గయ్యపేట గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర నుంచి మానిటరింగ్ పరిశీలించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టుల వద్ద పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సవాంగ్ తెలుసుకున్నారు.
 
హైవేలపై దాబాలు ఏర్పాట్లు, ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి అని సిబ్బందిని ప్రశ్నించారు డీజీపీ. అత్యవసర వస్తువుల రాకపోకలు ఉన్న వాహనాలను అనుమతి ఇస్తున్నామని  సిబ్బంది సవాంగ్‌కు తెలియజేశారు.
 
శ్రీకాకుళం, నాగార్జున సాగర్, విజయనగరం సాలూరు చెక్ పోస్ట్ దగ్గర సిబ్బందితో మాట్లాడిన డీజీపీ
ఉచిత భోజనం పంపిణీ గురించి హైవేలపై వెళ్తున్న వాహనాలకు సమాచారం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తమిళనాడు నుంచి వచ్చిన 50 మందిని క్వారంటైన్‌కు తరలించామని కర్నూలు బోర్డర్ సిబ్బంది తెలియజేశారు.
 
సరుకులు వెళ్లే వాహనాలను ఆపుతున్నారనే ఫిర్యాదులు రాకుండా పని చేయాలని డిజిపి సూచన చేశారు. యూపీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే వారు, బెంగళూరు నుంచి నడుచుకుంటున్న వారికి భోజన సదుపాయాలు కల్పించి వాహనాల ద్వారా వెనక్కి పంపుతున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా బాధితులైనా బుద్ధి మారలేదు.. నగ్నంగా తిరుగుతూ నర్సులను?