కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆటాడిస్తున్నా.. కొందరు వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావట్లేదు. కరోనా బాధితుల కోసం వైద్యులు, నర్సులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితులు నర్సుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి ప్రాణాంతక రోగమొచ్చినా మానవుడి బుద్ధిలో మాత్రం మార్పు రాలేదు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో జరిగిన ఓ ప్రార్థనలో సామూహికంగా పాల్గొన్నారు. వీరిలో చాలామందికి కరోనా సోకింది. వీరిలో ఆరుగురు ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు.
ఈ ఆరుగురు చికిత్సకు సహకరించలేదు. ఇంకా నర్సులను దూషించడం వంటివి చేస్తున్నారు. ఇంకా వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులను ఇబ్బందికి గురిచేసినట్లు నర్సులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేరొక ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.