Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్టా నది ఎడమవైపున వరద రక్షణగోడ నిర్మాణానికి సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శంకుస్ధాపన

Advertiesment
YS Jagan
, గురువారం, 1 ఏప్రియల్ 2021 (00:02 IST)
విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు కృష్టా నది ఎడమవైపున వరద రక్షణగోడ నిర్మాణానికి సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శంకుస్ధాపన చేశారు. 1.5 కిలోమీటర్ల మేర రూ. 122.90 కోట్లతో కృష్ణా నది వరద ఉద్ధృతిని తట్టుకునేలా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి శ్రీకారం
 
 చుట్టారు. ఈ గోడ నిర్మాణంతో రాణీగారి తోట, తారకరామానగర్, భూపేష్‌గుప్తా నగర్‌ ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 31 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలుగుతుంది.
 
ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కరీమున్నిసా, ఎమ్మెల్యేలు కైలే అనిల్‌కుమార్, మొండితోక జగన్‌మోహన్‌రావు, కొలుసు పార్ధసారధి, కొఠారి అబ్బయ్య చౌదరి పాల్కొన్నారు.
 
ఇంకా జోగి రమేష్, గుడివాడ అమర్‌నాద్, సింహాద్రి రమేష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, నందిగం సురేష్, మహిళా కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, విజయవాడ ఈస్ట్‌ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైఎస్‌ఆర్‌సీపీ నేత పొట్లూరి వరప్రసాద్, స్ధానిక నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్హులందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి: గవర్నర్ బిశ్వభూషణ్