Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో అతిపెద్ద లిక్కర్ డాన్ వైఎస్. జగన్ : టీడీపీ నేత పట్టాభి

దేశంలో అతిపెద్ద లిక్కర్ డాన్ వైఎస్. జగన్ : టీడీపీ నేత పట్టాభి
, సోమవారం, 29 మార్చి 2021 (20:45 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ జగనేనని ఆరోపించారు. జగన్ వ్యవహారశైలి చూస్తుంటే మద్యం వ్యాపారం మొత్తాన్ని అతని గుప్పిట్లోకి తెచ్చుకున్నారని ఆరోపించారు. 
 
రాష్ట్రంలో మద్యం వ్యాపారంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 3 వేల మద్యం దుకాణాలకు జగన్ యజమాన్నారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్ జగన్ రెడ్డని.. మద్యం దుకాణాలనేకాకుండా మద్యం ఉత్పత్తి డిస్టలరీలను కూడా గుప్పెట్లోకి తెచ్చుకున్నారని ఆరోపించారు. మద్యాన్ని ఉత్పత్తి చేస్తూ నాసిరకం బ్రాండ్లను అమ్ముతున్నారని విమర్శించారు. మొత్తంగా మద్యంపై వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.
 
ప్రజలు ఏ స్థాయికి దిగజారారంటే.. మత్తు కోసం శానిటైజర్లు తాగి మరణిస్తున్నారని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఫిబ్రవరి 2019కు రూ.5 వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ ఉంటే.. ఇప్పుడు 2021 ఫిబ్రవరికి రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. 
 
రూ.17,600 కోట్లు మద్యంపై ఆదాయం వస్తుందంటే.. మద్యాన్నే ఒక ఆదాయ వనరుగా జగన్ మార్చారని విమర్శించారు. సీఎం చెప్పినదానికి చేసిన దానికి ఎక్కడ పొంతనలేదన్నారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, మద్యపాన నిషేధం అనే ఊసే లేకుండా చేశారని పట్టాభి మండిపడ్డారు.
 
వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చెప్పారని.. ఇప్పుడది ఎక్కడకు వెళ్లిపోయిందో వారికే అర్థంకాని పరిస్థితిలో ఉందని ఓ మహిళ అన్నారు. తర్వాత దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారని.. దశలవారీగా మద్య నిషేదం అమలు చేస్తున్నారా? లేక దశలవారీగా ఆదాయ వనరులు పెంచుకుంటున్నారా? అనేది అర్థం కావడంలేదని ఆమె అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధురై: శరవణన్ వర్సెస్ షేక్ దావూద్.. రూ.10లక్షల రుణమాఫీ.. రోజూ మందు సప్లై!