Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగుతల్లికి జలహారతి.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే.. చంద్రబాబు (video)

Chandra babu

సెల్వి

, మంగళవారం, 31 డిశెంబరు 2024 (14:08 IST)
Chandra babu
రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వెల‌గ‌పూడి- గోదావరి జలాలను రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించిన‌ట్ల‌యితే ఆ ప్రాంతం స‌స్య‌శ్యామలం కావ‌డమే కాకుండా , రాయ‌ల‌సీమ‌లో క‌ర‌వు మ‌టుమాయం అవుతుంద‌ని చంద్రబాబు అన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున తీసుకువస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆ ప్రాజెక్టు పేరును ప్రకటించారు. "తెలుగుతల్లికి జలహారతి" అని ప్రాజెక్టు పేరు వెల్లడించారు. 
 
రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తరచుగా కరవు బారినపడుతున్నాయని వివరించారు. పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల నీటి వినియోగం కారణంగా… కృష్ణా నదిలో తగినంత నీటి లభ్యత ఉండడం లేదని వివరించారు. ఒక్క గోదావరి నదిలో మాత్రమే ఆశించిన మేర జలాలు అందుబాటులో ఉంటున్నాయని చంద్రబాబు తెలిపారు. గోదావరి నీటిని మళ్లించలగితే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. 
 
నదులు అనుసంధానం చేయగలిగితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి నీటి కొరత అనే మాట వినిపించదని స్పష్టం చేశారు. గోదావరి నుంచి కనీసం 300 టీఎంసీల నీటిని కృష్ణా నదికి తీసుకురావడం, కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇక్కడ్నించి బనకచర్లకు నీటిని తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టులో ప్రధానమైన అంశమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. 
 
నల్లమల అడవులను కొంతమేర నరికి టన్నెల్ ఏర్పాటు చేసిన బనకచర్లకు నీళ్లు తీసుకువెళతామ‌ని చంద్రబాబు తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఏపీకి ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. 
 
ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళ, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లా కొన్ని భాగాలు, నెల్లూరు, కడప, అనంతపురం… ఇలా రాష్ట్రమంతా అనుసంధానమై అదనపు ఆయకట్టు కూడా వస్తుంద‌న్నారు. ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదికను పంపిస్తున్నామని చంద్రబాబు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌లో అద్భుతం: భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం (video)