Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీరాల కి''లే''డి.. ఇంటికి రమ్మని తలుపులేస్తుంది.. ఆపై ఇద్దరు వచ్చి?

ఆ లేడీ కిలాడీ.. బాగా డబ్బున్న వారినే టార్గెట్ చేస్తుంది. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వలలో వేసుకుంటుంది. చివరికి ఇంటికి రమ్మంటుంది.. కానీ అక్కడ చుక్కలు చూపిస్తుంది. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛే

Advertiesment
చీరాల కి''లే''డి.. ఇంటికి రమ్మని తలుపులేస్తుంది.. ఆపై ఇద్దరు వచ్చి?
, మంగళవారం, 22 మే 2018 (11:10 IST)
ఆ లేడీ కిలాడీ.. బాగా డబ్బున్న వారినే టార్గెట్ చేస్తుంది. వారి ఫోన్ నెంబర్లు సేకరించి.. వలలో వేసుకుంటుంది. చివరికి ఇంటికి రమ్మంటుంది.. కానీ అక్కడ చుక్కలు చూపిస్తుంది. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ఛేదించిన ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులతో కలిసి ముఠాగా ఏర్పడిన ఓ యువతి డబ్బున్న కుటుంబాల పిల్లలను టార్గెట్ చేస్తూ బాగా డబ్బులు దోచేస్తుంది. 
 
తొలుత మిస్డ్ కాల్ ఇచ్చి.. ఆపై వారిని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ట్రాప్‌లో పడేసి భారీగా డబ్బు గుంజేస్తుంది. ఇదంతా చీరాల పరిధిలోని పేరాలకు చెందిన కంపా స్రవంతి ప్రియ, కుంభా ప్రకాష్, కావటి కిరణ్‌ అనే ముఠా చేస్తూ వచ్చింది. ఈ ముఠా ఏం చేస్తుందంటే.. ఇలా ఫోన్ ద్వారా నమ్మిన వారికి ప్రియ ఇంటికి పిలుస్తుంది. తలుపేసేస్తుంది. ఆ సమయంలో తలుపుకొట్టి లోనికి వచ్చే ప్రకాష్, కిరణ్‌లు తాము పోలీసులమని హడావుడి చేస్తూ బెదిరింపులకు దిగుతారు. 
 
బిత్తరపోయిన యువకుడిపై కేకలేస్తూ, వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టేస్తారు. ఏమీ లేకుంటే తలుపెందుకు వేసుకున్నారని నిలదీస్తారు. కేసు, విచారణ, అరెస్ట్ అంటూ హడావుడి చేస్తారు. ఇక కంగారు పడే యువకుడు కాళ్ల బేరానికి వస్తాడు. అప్పుడు ప్రకాష్, కిరణ్ భారీ నగదు డిమాండ్ చేసి.. కేసు లేకుండా చేస్తామంటారు. డబ్బు లేకుంటే ఏటీఎం కార్డు, పిన్ నంబర్ తీసుకుని ఖాతాను ఖాళీ చేస్తారు. 
 
గుంటూరుకు చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు రెండు రోజుల క్రితం స్రవంతి ఇంట్లో ఇదే విధంగా బుక్ అయి, రూ. 13 వేలు సమర్పించుకున్నాడు. ఆపై కూడా స్రవంతి ఫోన్ చేసి, రూ. లక్ష ఇవ్వాలని, లేదా పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ఇస్మాయిల్ చీరాల పోలీసులను ఆశ్రయించగా, వారు నకిలీ పోలీసులను, స్రవంతిని జైలుకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయ్ నుంచి వచ్చాడు.. రంజాన్ షాపింగ్ పేరుతో బయటకు తీసుకెళ్లి...