Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి బలి.. కన్నబిడ్డకు అడ్డుగా వుందని..

వివాహేతర సంబంధం.. ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్డు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్డు జిల్లా పెరుందురై సమీప కరుమాండిసెల్లిపాళయానికి చెందిన షణ్ముగనాథన్‌(40),

Advertiesment
వివాహేతర సంబంధం.. ఏడేళ్ల చిన్నారి బలి.. కన్నబిడ్డకు అడ్డుగా వుందని..
, మంగళవారం, 15 మే 2018 (17:49 IST)
వివాహేతర సంబంధం.. ఓ చిన్నారి ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన తమిళనాడు, ఈరోడ్డు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్డు జిల్లా పెరుందురై సమీప కరుమాండిసెల్లిపాళయానికి చెందిన షణ్ముగనాథన్‌(40), కనక (34) దంపతులకు తనిష్క (7) అనే కుమార్తె ఉంది.


రెండు రోజుల క్రితం ఆడుకునేందుకు వెళ్లిన తనిష్క అదే ప్రాంతంలోని ఓ చెట్టు సమీపంలో రక్తగాయాలతో మృతిచెంది ఉండటాన్ని పోలీసులు గమనించారు. బాలిక మృతదేహానికి జరిపిన పోస్టుమార్టంలో ఆమె గొంతు నులిమి హత్య చేయబడిందని తేలింది. 
 
ఈ కేసు విచారణలో తనిష్కను పక్కింటి వనిత (33) గొంతు నులిమి హత్య చేసిందని తేలింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు తనిష్క ఇంటి పక్కనే ఉన్న వనితను అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో చిన్నారిని తానే హత్యచేసినట్లు ఆమె అంగీకరించింది. కనక భర్త మద్యానికి బానిస కావడంతో తరచూ వారి మధ్య విభేదాలు తలెత్తుతుండేవని.. ఆ క్రమంలో, ఇంటి పక్కనే ఉన్న కమల్‌కన్నన్‌ (వనిత భర్త)కు కనకతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.
 
కమల్‌కన్నన్‌ ఎక్కువ సేపు కనకతో ఉండడం, ఆమె కుమార్తె తనిష్కను మరింత ప్రేమగా చూసుకోవడంపై వనిత భర్తను నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తనిష్క ఉంటే తాను, తన ఎమిదేళ్ల కుమారుడు బతకలేమని నిర్ణయించుకున్న వనిత చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుంది.

బయట ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశానంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. జైలుకు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక రాజకీయం.. కాంగ్రెస్ - జేడీఎస్ నేతలకు ముఖం చాటేసిన గవర్నర్