Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దృష్టి మళ్లించేందుకే చీప్ ట్రిక్స్: లోకేష్

దృష్టి మళ్లించేందుకే చీప్ ట్రిక్స్: లోకేష్
, శనివారం, 16 నవంబరు 2019 (17:39 IST)
కృత్రిమ ఇసుక కొరత సృష్టించి 42 మంది భవన నిర్మాణ కార్మికులను హత్య చేసిన వైకాపా ప్రభుత్వం, జగన్ గారు చేతగాని పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు మరో కుట్రకి తెరలేపారు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

ఇంతకాలం వరద కారణంగా ఇసుక కొరత ఏర్పడింది. పోలీసులే అక్రమ ఇసుక రవాణాని ప్రోత్సహిస్తున్నారని తలో మాటా చెప్పిన వైకాపా నేతలు.. ఇప్పుడు తనపై అసత్య ప్రచారాలకు తెర లేపారని లోకేష్ అన్నారు. వైకాపా ఇసుకాసురులు అడ్డంగా దొరికిపోయారు. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైకాపా నేతల జాతకాలు టిడిపి బయటపెట్టడంతో వైకాపా ప్రభుత్భం మరో కొత్త నాటకం మొదలు పెట్టిందన్నారు.

"5 నెలలుగా 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్ల పాలు చేసి 42 మందిని వైకాపా ఇసుకాసురులు బలి తీసుకున్నారు. ఇప్పుడు చేసిన తప్పులు బయటపడి ప్రజలు మోహన ఉమ్ము వేసే పరిస్థితి రావడంతో మరో సారి కట్టు కథ రెడీ చేసింది. గతంలోనే జగన్ నాపై అనేక ఆరోపణలు చేసారు.

అధికారంలోకి వచ్చి ఐదు నెలల అయినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసారు. విశాఖలో బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీపై సిఐడి దాడులు, లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కంపెనీ అంటూ మరో అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. నేను గతంలో అనేక సార్లు జగన్ గారికి నేరుగా సవాల్ చేసా.

ఇప్పుడు మరోసారి సవాల్ విసురుతున్నా, జగన్ గారి చెత్త మీడియాకి కూడా నేరుగా సవాల్ చేస్తున్నా, దొంగ చాటుగా అసత్య వార్తలు ప్రచారం చేసి ఆనంద పడటం కాదు, దమ్ముంటే నాపై మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించండి. బ్లూ ఫ్రాగ్ కంపెనీకి, నాకు ఎటువంటి సంబంధం లేదు.

నాకు ఆ కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు అసత్య వార్తలు సృష్టించిన వారిపైనా,సోషల్ మీడియా ఒక కుట్ర ప్రకారం నాపై జరుగుతున్న ఈ అసత్య ప్రచారం, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా" అని లోకేష్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విదేశాలకు ఐఎంఎస్ స్కాం సొమ్ము..'ఆదాబ్' చేతిలో బినామీ కంపెనీల జాబితా