Publish Date: Wed, 30 Aug 2023 (22:08 IST)
Updated Date: Wed, 30 Aug 2023 (22:15 IST)
టీడీపీ కార్యకర్తలపై పల్నాడులో జరిగిన దాడిపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నేతలను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
గ్రామంలో వైసీపీ గూండాలు ఇళ్లపై పడి గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే నివారించలేక పోవడం పోలీసుల వైఫల్యమేనని చంద్రబాబు అన్నారు.
పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు పోలీసులు ఇస్తున్న మద్దతే ఇలాంటి ఘటనలకు కారణమని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా, మారుణాయుధాలతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.